దర్శి: దర్శి లో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని అధికారులకు స్థానికులు విజ్ఞప్తి
ప్రకాశం జిల్లా దర్శి ఆర్ టి సి బస్టాండ్ కార్యకలాపాలు పొదిలి డిపో పరిధిలో ఉంది. మార్కాపురం జిల్లాలో పొదిలి డిపో చేరడంతో ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి ఆర్టీసీ బస్టాండు వేరుపడే అవకాశం ఉంది. దీంతో ఆర్టీసీ డిపోను దర్శి లో ఏర్పాటు చేయాలని స్థానికుల నుండి వాదనలు వినపడుతున్నాయి. అందుకు సంబంధించిన స్థలం కూడా ఉందని స్థానికులు తెలిపారు. ఆ దిశగా నాయకులు అధికారులు కృషి చేయాలని కోరారు