గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని ఏబీఏం పాలెంలో రోకల బండ్లతో దాడి చేసి భార్యను హత్య చేసిన భర్త, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ABM పాలెంలో గురువారం దారుణం చోటుచేసుకుంది. భార్యపై రోకలబండతో దాడి చేసి హత మార్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రేమ కుమారిని భర్త రోకలిబండతో దాడి చేసే హతమార్చడంతో ఆమె రక్తపు మడుగులో పడి మృతి చెందింది. నిందితుడు తర్వాత సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అతడికి మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.