కొండపి: కొండపికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి యశ్వంత్ అదృశ్యం, పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
ప్రకాశం జిల్లా కొండపికి యశ్వంత్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అదృశ్యమైన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. కృష్ణాజిల్లా గన్నవరంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న యశ్వంత్ ఈనెల 17వ తేదీన పరీక్షలు ఉన్నాయని చెప్పి కొండపి నుంచి గన్నవరం వెళ్ళాడు. తర్వాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎవరన్నా యశ్వంత్ ని గుర్తిస్తే 9855844121 నంబర్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.