దర్శి: సోమవరప్పాడు గ్రామంలో గుంటి గంగమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు
Darsi, Prakasam | Jul 12, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం సోమవరప్పాడు గ్రామంలో గుంటి గంగమ్మ అమ్మవారి దేవస్థానం నందు భక్తులతో సందడి వాతావరణం నెలకొన్నది. అమ్మవారికి కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొంగళ్ళు తయారు చేసుకొని ప్రదక్షణలు చేసి అమ్మవారికి సమర్పించి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని ఇక్కడ స్థానికులు నమ్ముతారు అందులో భాగంగా ప్రతివారం ప్రత్యేక పూజలు చేస్తారు.