యర్రగొండపాలెం: త్రిపురాంతకం ఉమ్మడి ఆలయాల ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత జెసి శ్రీనివాసులు టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మానవ జీవితంలో యోగ ఎంత అవసరమో దాని ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో అలవాటు చేసుకోవాలని తెలిపారు.