మార్కాపురం: జిల్లా కేంద్రంలోని పదవ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ నారాయణరావు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో ఉన్న పదవ సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా సచివాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. సిబ్బంది యొక్క పనితీరును ఆరా తీశారు. ఇటీవల సచివాలయంలో ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకున్న అర్జీదారునితో నేరుగా ఫోన్లో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగుల పనితీరు ఏ విధంగా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఎన్ని రోజులకు ఇవ్వడం జరిగిందని సంబంధిత వివరాలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.