మార్కాపురం: పెండింగ్ లో ఉన్న ఈకేవైసీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఈకేవైసీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 21 మండలాలలో 10 లక్షల 15వేల 212 మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా అందులో 9 లక్షల 48 వేల 636 మంది ఈకేవైసీ చేయించుకున్నారు అన్నారు. పెండింగ్ లో ఉన్న 66 వేల 670 మంది ఈకేవైసీ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.