దర్శి: పేదల సేవే తమ లక్ష్యమని సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తామని వెల్లడించిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ లక్ష్మి
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తురకపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా వారి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. వృద్ధులకు దివ్యాంగులకు వితంతువులకు ప్రతి నెల ఒకటో తేదీ పింఛన్ అందజేస్తున్న ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేదల సేవే తమ లక్ష్యం అని సంక్షేమం అందరికి చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.