మార్కాపురం: తర్లుపాడు మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం, లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే సతీమణి వసంతలక్ష్మి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులలో చికిత్స పొందేందుకు దరఖాస్తు చేసుకున్న ఐదు మందికి రూ.1.68 లక్షల విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు వసంత లక్ష్మి తెలిపారు. ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారని అన్నారు.