కొండపి: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నేతల ఆరోపణలను ఖండించిన మంత్రి స్వామి
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పాలన మాత్రమే నడుస్తుందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నట్లు రెడ్బుక్ రాజ్యాంగం నడవట్లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఒంగోలు నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత వైసిపి పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారని, కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.