కొండపి: పొన్నలూరులోని భోగనంపాడులో అంకమ్మ తల్లి తిరునాళ్లలో అలరించిన యువతుల డాన్సులు
పొన్నలూరులోని భోగనంపాడులో అంకమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ప్రభలపై సినిమా, రాజకీయ పార్టీల పాటలకు అమ్మాయిలు డాన్స్లు వేసి అలరించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వాసులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు