కొండపి: మహిళ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించిన కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి
ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సోమవారం మద్దిపాడు మండలంలో హర్షిని మహిళ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మార్కాపురం ఎమ్మెల్యే తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించడంపై మంత్రి స్వామి యాజమాన్యాన్ని అభినందించారు.