దర్శి: తాళ్లూరు మండలంలో తెల్లవారుజామున ఆకస్మికంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
Darsi, Prakasam | Jun 20, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. శుక్రవారం విపరీతమైన ఎండ నమోదయి ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఒక్కసారిగా పడిన వర్షంతో ఉపశమనం లభించింది. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఉరుములు వస్తాయి తెలియని పరిస్థితిలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. వర్షం పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు.