కొండపి: జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పైడిపాడులో ఒంగోలు డి.ఎస్.పి శ్రీనివాసరావు, ఈగల్ టీం పోలీసు సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదకద్రవ్యాలు కలిగి ఉండడం, వినియోగించడం, సరఫరా చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని తెలిపారు. అలాంటి కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే 1972 నంబర్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.