గిద్దలూరు: గిద్దలూరు మండలం పెద్ద చెరువు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం పెద్ద చెరువు గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పెన్షన్లు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీలోపు సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే పెన్షన్లు తీసుకువచ్చి అందిస్తున్నారని భవిష్యత్తులో పేదలకు మరింత మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రం సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి చెందుతుందన్నారు.