దర్శి: మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న వైద్యాధికారి డాక్టర్ మధు శంకర్
ప్రకాశం జిల్లా మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ మధు శంకర్ మాట్లాడుతూ పుట్టిన గంటలోపు శిశువుకు తల్లిపాలు అందించడం తల్లి బిడ్డల ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం అని తెలిపారు. తొలి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వాలని అవే శిశువుకు తొలి టీకా వంటివని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.