గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని ఏబీఏం పాలెం లో విద్యుత్ స్తంభంపై షార్ట్ సర్క్యూట్, మంటలు చెలరేగడంతో ఆందోళన చెందిన స్థానికులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబీఏం పాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం ప్రజలు ఆందోళన చెందారు. మంటలు ఒక్కసారిగా చిన్న రేగడంతో స్థానికులు ఆందోళన చెంది విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చుట్టుకొమ్మలు విద్యుత్తు తీగలపై పడడం వల్లే ఈ ఘటన జరిగినట్లుగా విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. వెంటనే సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.