నంద్యాల అర్బన్: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 23 మంది పై ఎక్సైజ్ అధికారుల బైండోవర్ కేసులు
Nandyal Urban, Nandyal | Nov 13, 2026
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ రవికుమార్ ఆదేశాల మేరకు నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, డోన్, బనగానపల్లె ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ CI కృష్ణమూర్తి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ 650 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, 23 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.