గిద్దలూరు: బేస్తవారిపేటలో కుటుంబ కలహాలు, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
యాంకర్ వాయిస్.. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట పాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీధిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలు, అప్పుల బాధతో సండే మోషే (29) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు కంభం ప్రభుత్వాసుపత్రి తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్పాట్ విజువల్స్..