రాయదుర్గం: డి.హిరేహాల్, బొమ్మనహాల్ లో జరిగిన టిడిపి మహానాడు లో పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్, బొమ్మనహాల్ మండలాల్లో బుధవారం మెదటి రోజు నిర్వహించిన టిడిపి డిజిటల్ మహానాడులో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే తనయుడు కాలవ భరత్, క్లస్టర్ ఇంచార్జ్ బోయ గంగాధర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత రెడ్డి, మండల కన్వీనర్ కాదలూరు మోహన్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నాగళ్ళిరాజు తో కలసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపి మాట్లాడుతూ “నా తెలుగుదేశం - నా బాధ్యత” అనే నినాదంతో రెండు రోజుల పాటు జరిగే మహానాడు-2026 ను పసుపు పండుగలా విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.