రాయదుర్గం: మల్లాపురం విప్రమలై లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నరసింహ స్వామి జయంతి
రాయదుర్గం మండలం మల్లాపురం శ్రీ విప్లమలై లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం నరసింహ స్వామి జయంతి భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు రామ్మూర్తి స్వామీజీ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం స్వామి ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ పంచామృతాభిషేకం పుష్పాలంకరణ నైవేద్య పూజలు నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులతో లక్ష తులసి అర్చన గావించారు మద్యాహ్నం శాంతి హోమం, పూర్ణాహుతి మహా మంగళహారతి నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి విరి కల్యాణోత్సవం నిర్వహించినట్లు ఆలయ వారు తెలియజేసారు.