మార్కాపురం: జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో రెండు పాములు కలకలం, పట్టుకున్న ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ నిరంజన్
మార్కాపురం జిల్లా కేంద్రంలోని తూర్పు వీధి రాధాకృష్ణ థియేటర్ వెనక రెండు పాములను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న నిరంజన్ వెంటనే రెండు పాములను పట్టుకున్నారు. ఈ పాముల వల్ల ఎలాంటి హాని ఉండదని అడవి ప్రాంతంలో వదిలిపెడతామని తెలిపారు. పాముల కనపడితే సమాచారం ఇవ్వాలని కోరారు.