రాయదుర్గం: జిల్లా కలెక్టర్ ను బురడీ కొట్టించిన ఘటన పై విచారణ చేపట్టిన డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబి దేవి
బొమ్మనహాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు చల్లా శ్రీ లక్ష్మీ విధులకు డుమ్మాకొట్టి జిల్లా కలెక్టర్ నే బురడీ కొట్టించిన ఘటనపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఈ. బి దేవి విచారణ చేపట్టారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ తనిఖీ లో ఎంఎల్ హెప్పి తానే డాక్టర్ శ్రీలక్ష్మి అంటూ కలెక్టర్ తో మాట్లాడి కలెక్టర్ ను బురడీ కొట్టించిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గురువారం మద్యాహ్నం నుంచి సాయంత్రం దాకా వైద్యులు, సిబ్బంది ని విచారించారు. ఆమె విచారణలో వెలుగు చూసిన విషయాలను పేర్కొంటూ తదుపరి చర్యలకు జిల్లా కలెక్టర్ కు నివేదించనున్నారని తెలిసింది.