గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రైల్వే గేటు వద్ద వాహనదారులకు వేసవి నేపథ్యంలో నీడ టెంట్ ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రైల్వే గేటు వద్ద బుధవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వేసవికాలం నేపథ్యంలో గ్రీన్ మేట్ ఆధారంగా టెన్త్ ఏర్పాటు చేశారు. పెరిగిన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని వాహనదారులు అనారోగ్యం బారిన పడకుండా వారికోసం ఈ నీడ టెంట్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. రోజుకు పలుమార్లు రాచర రైల్వే గేట్ పడుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఈ నీడ టెంట్ ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు.