కనిగిరి: కనిగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా పల్లకి సేవ, భారీగా పాల్గొన్న భక్తులు
మార్కాపురం జిల్లా కనిగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. అర్చకులు చోడ వీరభద్రస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వలేటి సాంబశివరావు భక్తులకు అల్పాహారం ఏర్పాటుచేశారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కుందూరు తిరుపతిరెడ్డితోపాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.