రాయదుర్గం: పట్టణ శివారులో నెమలిపై కుక్కల దాడి, రక్షించిన స్థానికులు
రాయదుర్గం పట్టణ శివారులో కుక్కల దాడి నుంచి తప్పించుకనేందుకు యత్నించిన ఓ ఆడ నెమలిని స్థానికులు రక్షించారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ లో దానిని అప్పగించారు. వారు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వగా డిప్యూటీ ఫారెస్టు రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి ఆదేశాలతో అటవీ సిబ్బంది వెళ్లి నెమలిని స్వాధీనం చేసుకున్నారు. దాని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి అనంతరం సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలారు. వణ్యప్రాణులను ఎవరూ వేటాడకూడదని వాటి రక్షణ అందరి భాధ్యత అని డిఆర్ఓ దామోదర రెడ్డి తెలిపారు. నెమలి ప్రాణాన్ని రక్షించిన వారిని అభినందించారు.