యర్రగొండపాలెం: దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం వివరాలను వెల్లడించిన సీఐ అజయ్ కుమార్
మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. సంబంధిత వివరాలను సీఐ అజయ్ కుమార్ తెలిపారు. ఘాట్లో వర్షం పడుతున్న సమయంలో మార్కాపురం డిపో ఆర్టీసీ బస్సు ముందుగా వస్తుంది. ఎదురుగా మరో వాహనం రావడంతో ఈ వాహనాన్ని తప్పించేందుకు ప్రయత్నించగా అదుపుతభి బోల్తా పడినట్లు తెలిపారు. ఇంతలో వెనకనే వస్తున్న ఇంద్ర బస్సు ముందు జరిగిన ఘటనను గమనించి బ్రేకు వేయగా స్కిడ్ అయి రోడ్డు పక్కకు దూసుకెళ్లినట్లు తెలిపారు.