మార్కాపురం: జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లాలోని ప్రజలకు జిల్లా కలెక్టర్ విజయ సునీత పలు సూచనలు చేశారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప మిగతా సమయాలలో బయటికి రావద్దన్నారు. ఇప్పటికే జిల్లాలో అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు మధ్యాహ్నం సమయంలో బయట తిరగవద్దన్నారు. వాతావరణ శాఖ సూచనలు పాటించాలన్నారు.