మార్కాపురం: పీర్ల పండుగ అంటే గుర్తొచ్చేది తుమ్మలచెరువు గ్రామంలోని కాసిం స్వామి దర్గా
పీర్ల పండుగ అంటే తర్లుపాడు మండలంలో ఉన్న తుమ్మలచెరువు గుర్తొస్తుంది. గ్రామంలో జరిగే ఖాసీం స్వామి పీర్ల పండుగ ఎంతో ప్రసిద్ధి చెందింది. కర్బలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ ముస్లిం అమరవీరుల విరోచిత త్యాగాల జ్ఞాపకార్థం ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. గ్రామస్తులు అందరూ కలిసి కులమతాలకు అతీతంగా పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇవాళ రాత్రికి పెద్ద సరిగెత్తు ఉంటుందని ముజావర్లు తెలిపారు.