రాయదుర్గం: కుక్కల దాడి నుంచి కాపాడి జింకపిల్లను ఫారెస్టు అధికారులకు అప్పగించిన రైతు
రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామానికి చెందిన రైతు చంద్రకాంత్ పొలంలో దొరికిన జింకపిల్లను బుధవారం ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. రైతు పొలంలో పనులు చేస్తుండగా జింకపిల్లను కుక్కలు తరుముకుని వచ్చాయి. దీంతో రైతు కుక్కలను తరిమేసి దాన్ని చేరదీసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. డిప్యూటీ ఫారెస్టు రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం జింకపిల్లను స్వాధీనం చేసుకున్నారు. పశు వైద్యులు డాక్టర్ నవీన్ వైద్యం అందించారు. జింకపిల్ల వయసు 13 రోజులు ఉంటుందన్నారు. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలేస్తామని ఫారెస్టు అధికారులు తెలిపారు.