కొండపి: కొండపి మండలం ముక్కోడి పాలెం గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా కొండపి మండలం ముక్కోడి పాలెం గ్రామంలో ఆదివారం పేకాట ఆడుతున్న నలుగురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,330 నగదు స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.