రాయదుర్గం: పట్టణంలోని బిటిపి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రాయదుర్గం పట్టణ BTP రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పూజారి సోమప్ప(55) మృతి చెందాడు. రేకులకుంటకు చెందిన ఇతను నేతాజీ రోడ్డులో నివాసం ఉంటూ కూలిపనులు చేసేవాడు. శుక్రవారం తెల్లవారుజామున పనికి వెళుతుండగా గుర్తు తెలియని బైక్ డీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.