మార్కాపురం: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఒక ప్రకటన లో పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ మీడియం ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫార్ములు, మధ్యాహ్న భోజనం, తల్లికి వందనం వంటి అనేక కార్యక్రమాలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాణించాలని ఆమె విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.