దర్శి: తూర్పు వెంకటాపురం గ్రామానికి చెందిన మూడో తరగతి విద్యార్థి కోమలి జి ఎఫ్ ఎల్ ఎం పరీక్షలో ప్రతిభ
ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వెంకటాపురం గ్రామానికి చెందిన ఆదర్శ ప్రాథమిక పాఠశాల మూడో తరగతి విద్యార్థిని జంపాల కోమలి జి ఎఫ్ ఎల్ ఎన్ పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు. విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సందర్భంగా దర్శి ఎంఈఓ లు మాలకొండయ్య రమాదేవి, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా విద్యార్థిని కోమలిని అభినందించారు.