మార్కాపురం: తర్లుపాడు మండలం ఓబాయపల్లి గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం ఒబాయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు