రాయదుర్గం: పట్టణంలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే
రాయదుర్గం పట్టణంలో త్రాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా త్రాగునీటి శుద్ధి కేంద్రం నుండి బళ్లారి రోడ్డులోని GLSR వరకు రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన పైప్‌లైన్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ప్రారంభించారు. అలాగే పట్టణంలోని 32వ వార్డులో రూ.30.65 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, టిడిపి నేతలు టంకశాల హనుమంతు, బండి కృష్ణమూర్తి వార్డు ఇన్చార్జ్ లు పాల్గొన్నారు.