తాడిపత్రి: వెంకటాంపల్లి సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 133 గ్యాస్ సిలిండర్లను పట్టుకున్న పోలీసు, రెవెన్యూ అధికారులు
తాడిపత్రి మండలం వెంకటాంపల్లి సమీపంలోని కంకర మిషన్ వద్ద అక్రమంగా దాచి ఉంచిన 133 గ్యాస్ సిలిండర్లను రెవెన్యూ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ మల్లేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది గురువారం దాడులు నిర్వహించి 133 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గ్యాస్ సిలిండర్ల దందాకు పాల్పడిన మురళి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. తాడిపత్రి కి చెందిన మురళి ప్రజల వద్ద నుంచి డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేసి వాటిని కమర్షియల్ గా మార్చి విక్రయించేవాడని అధికారులు చెప్పారు.