దర్శి: తాళ్లూరు మండలంలోని వైసీపీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన కార్యక్రమం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యాలయం నుండి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ పడాలని పిలుపునిచ్చారు. బిఎల్ఓ ల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఓట్ల తప్పిదాలు జరిగితే బూచేపల్లి కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు.