సంతనూతలపాడు: ఉమ్మడి జిల్లాలో చోరీకి పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన దొంగలు అరెస్ట్, వివరాలు తెలిపిన ఎస్పీ
ప్రకాశం జిల్లా రాష్ట్రంలో పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఐదుగురిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో చోరీలకు పాల్పడ్డ దొంగల వద్ద నుంచి రూ. 4.70 లక్షలు విలువచేసే బంగారం వెండి వస్తువులు స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.