దర్శి: కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో కొండచిలువ కలకలం
Darsi, Prakasam | Jun 13, 2026 ప్రకాశం జిల్లా కుడిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో 12 అడుగుల భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి స్నేక్ క్యాచర్ రామకృష్ణ కొండచిలువను పట్టుకున్నారు. కొండచిలువతో పాటు దాదాపు 20 గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. కొండచిలువను అడవిలో వదిలిపెట్టి గుడ్లను మార్కాపురం ఫారెస్ట్ కార్యాలయంలో సురక్షితంగా ఉంచుతున్నట్లు తెలిపారు.