యర్రగొండపాలెం: చిట్టాడివిని తలపిస్తున్న పెద్దారవీడు మండలం కలనూతల నిర్వాసితుల కాలనీ
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన కలనూతల నిర్వాసితులకు ఇడుపూరు-2లో పునరావస కాలనీ ఏర్పాటు చేశారు. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించి ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. పునరావస కాలనీలో ప్రభుత్వ పాఠశాలలు, ఆలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు సిమెంటు రోడ్లు ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలు కావడంతో కాలనీ చిట్టి అడివిని తలపిస్తుంది. భవనాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి