మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు
మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ లో రోజుకు ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. ప్రధానంగా స్వచ్ఛభారత్ కింద బస్టాండ్ ఎదురుగా స్త్రీలకు పురుషులకు ఉచితంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వాటిని వినియోగించుకోకుండా నిరుపయోగంగా మార్చారు. కేవలం మోటర్ బైకులు పెట్టుకోవడానికి పరిమితం చేశారు. మరోవైపు వర్షం పడితే బురదగా మారుతున్న ప్రాంతంలో మట్టిని తొలగించారు. అక్కడ కాంక్రీట్ వేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామన్నారు.