రాయదుర్గం: ఎన్యుమరేషన్ ఫారాల నమోదు వేగవంతం చేయాలి : రాయదుర్గం తహసీల్దార్ సూర్యప్రతాప్
రాయదుర్గం నియోజకవర్గంలో ఇప్పటివరకు 60 శాతం ఎన్యుమరేషన్ ఫారాల అప్‌లోడ్ పూర్తయిందని ఏపిఆర్ఓ, తహసీల్దార్ సూర్యప్రతాప్ తెలిపారు. సోమవారం రాయదుర్గం మండలంలోని బొమ్మక్కపల్లి, రేకులకుంట, జుంజురాంపల్లి గ్రామాల్లో ఎస్‌ఐఆర్ ఓటరు నమోదుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాల ఆన్‌లైన్ నమోదు వేగవంతం చేయాలని బిఎల్ఓలకు సూచించారు. రాయదుర్గం మండలంలో 67 శాతం, పట్టణంలో 63 శాతం పూర్తయిందన్నారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయాలని బిఎల్ఓలకు ఆదేశించారు.