రాయదుర్గం: పట్టణంలోని శాంతినగర్ లో టైలర్ ఆత్మహత్య
రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్‌లో నాయకుల నాగరాజు (39) అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టైలర్‌గా పనిచేసే అతను మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవపడేవాడు. సోమవారం రాత్రి మద్యం మత్తులో గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో నాగరాజు ఉరివేసుకున్నాడు. మంగళవారం ఉదయం భార్య వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.