గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలో దివ్యాంగులకు 10 ద్విచక్ర వాహనాలు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వెల్లడి
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో దివ్యాంగులకు పది ద్విచక్ర వాహనాలు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీడియాకు శనివారం తెలిపారు. మార్కాపురంలో శనివారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా నియోజకవర్గానికి చెందిన పదిమంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు ఉచితంగా అందించడం జరిగిందన్నారు. ఇప్పటికే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అలానే పెన్షన్ కూడా వారికి 6000 రూపాయల వరకు పెంచడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.