మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కరెంట్ ఆఫీసులో ట్రాన్స్ఫారం మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తో వెంకటేశ్వర్లు మృతి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని తర్లుపాడు రోడ్డులో గల కరెంట్ ఆఫీసులో హెల్పర్ గా పనిచేస్తున్న భీమనబోయిన వెంకటేశ్వర్లు ట్రాన్స్ఫారం మరమ్మతులు చేస్తూ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందారు. మృతునికి కుమార్తె కుమారుడు భార్య ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తాత్కాలికంగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వెంకటేశ్వర్లు మృతితో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.