మార్కాపురం: టిడిపి పార్టీలో చేరుతున్నట్లు స్వయంగా వెల్లడించిన పొదిలి మండల మాజీ వైసీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
మార్కాపురం జిల్లా పొదిలి మండల మాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గెంపూడి శ్రీనివాసరెడ్డి టిడిపి పార్టీలో చేరుతున్నట్లు స్వయంగా వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పరిపాలన, సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చేస్తున్న నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఆకర్షితుడినై టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలిపారు.