తాడిపత్రి: మున్సిపాలిటీ మంచి పేరును చెడగొట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు: తాడిపత్రిలో టీడీపీ మాజీ కౌన్సిలర్లు
తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధిని, మంచి పేరును చెడగొట్టడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా మున్సిపల్ అధికారులపై అబాండాలు వేస్తున్నారని టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు అన్నారు. తాడిపత్రిలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. సచివాలయ, మున్సిపల్ ఉద్యోగులకు సెలవు ఇవ్వలేదని కోపంతో మున్సిపల్ అధికారిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసిపి తో పాట అనంతపురం కు చెందిన ఓ వ్యక్తి యూనియన్ అడ్డం పెట్టుకొని మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారన్నారు. మున్సిపల్ కౌన్సిల్ లేదని కొందరు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మున్సిపాలిటీకి ఎక్స్ అఫీషియో సభ్యుడు అనే విషయాన్ని మరిచిపోయినట్లున్నారు.