కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో నిరాశ జనకంగా ముగిసిన వేలం, ఏకంగా 216 పొగాకు బెల్లు తిరస్కరణకు గురి కావడంతో రైతులు ఆవేదన
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో తిరస్కరణలు కొనుగోళ్ల కన్నా అధికంగా ఉన్నాయి. కోయవారిపాలెం, ధర్మవరం గ్రామాల రైతులు 397 బేళ్లు తీసుకురాగా 181 బేళ్లు మాత్రం కొనుగోలు చేశారు. 216 బేళ్లను తిరస్కరించడంతో రైతులు వాపోతున్నారు. ఎండలో విపరీతంగా ఉండడంతో పొగాకు నాణ్యత తగ్గిపోయి కొనుగోలు జరగకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.