దర్శి: దర్శి పట్టణంలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని మరియు మోటార్ బైకును ఢీకొన్న కారు
Darsi, Prakasam | Jun 13, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది మద్యం మత్తులో కారు నడుపుతున్న యువకుడు రోడ్డుపై వెళ్తున్న పాదాచారులను ఢీకొన్నాడు. అనంతరం పక్కనే వెళ్తున్న మోటార్ సైకిల్ ను కూడా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కారు నడిపిన యువకుడిని అదుపులోకి తీసుకొని కారును స్వాధీనం చేసుకున్నారు.